తెలివైన హరికృష్ణ అసలు స్వరూపం!

ఎన్టీఆర్ ను చంద్రబాబు గద్దె దించడం వెనుక హరికృష్ణ మద్దతు లేకపోలేదు. తండ్రి మానసిక క్షోభ అనుభవిస్తాడని తెలిసినా లక్ష్మీపార్వతి మీద ఆగ్రహంతో చంద్రబాబు నాయుడుకు ఆనాడు ఆయన మద్దతు ఇచ్చాడు. తన ఎమ్మెల్యేలను క్యాంప్ గా పెట్టిన వైస్రాయ్ హోటల్ కు ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు ఆయన మీద చెప్పులు పడ్డాయి. తండ్రి మీద అటువంటి దాడి జరుగుతుందని తెలిసినా హరికృష్ణ ఆ పరిసరాల్లో లేకుండా జాగ్రత్త పడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడానికి సహకరించాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు హయాంలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందన్న గ్యారంటీ లేదు. అయినా మరో ఐదేళ్ళ పాటు హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా ఎంజాయ్ చేయవచ్చు.












Click it and Unblock the Notifications