తెలంగాణ హోం మంత్రి హరీష్?

Harish Rao
ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును అనడంలోని ఆంతర్యం అందరికీ తెలిసిందే. కానీ, ఆయన మాటల్లో ఎంతో కొంత నిజం లేకపోలేదని మాత్రం అర్థమవుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని నమ్ముతున్న తెరాసలో పదవులు పంపకాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హోం మంత్రి హరీష్ రావు అవుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇటువంటి ప్రచారం జరగడానికి ఆంధ్ర మీడియా పాత్ర చాలా వరకు ఉందనే విషయంలో కూడా సత్యం లేకపోలేదు. కానీ తెరాస నాయకులు తెలంగాణ ఏర్పడిన తర్వాత తాము ఏ పాత్రలు పోషించాలనే విషయంపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే హరీష్ రావు హోం మంత్రి అవుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. తెరాసలో ఆయన బలమైన నాయకుడిగా ఎదుగుతూ వస్తున్నారు. కెసిఆర్ కుమారుడు కెటి రామారావు, కూతురు కవిత ముందుకు వచ్చినా ఆయన ప్రాబల్యం తగ్గలేదు. ఆయన ఎప్పటికప్పుడు తన ప్రత్యేకతను కాపాడుకుంటూ వస్తున్నారు. ఆయకున్న సంబంధాల వల్ల అటువంటి ప్రచారం జరుగుతూ ఉండవచ్చు. ఏమైనా, అందుకు హరీష్ రావు తగినవాడే అవుతారని ఆయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+