చిరంజీవికి పాఠాలు చెప్పా: రాజేంద్రప్రసాద్

"చిరంజీవి కంటే మూడేళ్లు సీనియర్‌ని. మూమెంట్ అండ్ మైమ్ అంటే ఏమీ లేకుండా ఉన్నట్లు చూపించడం. అందులో గోల్డ్ మెడలిస్టును. చిరంజీవికి కూడా ఇదే చెప్పాను.19 ఏళ్లకే ఇంజనీరింగ్ పూర్తయ్యాక ఉద్యోగం వచ్చినా వయసు సరిపోలేదు. నిమ్మకూరులో పుట్టాను. ఎన్టీరామారావుగారి ఇంట్లో 24 ఏళ్లు ఉన్నాం. ఆ సమయంలోనే తాతమ్మ కల సినిమా షూటింగ్ కోసం ఎన్టీఆర్‌కు వచ్చిన జనాన్ని చూసి..థ్రిల్ అయిపోయి..మనమెందుకు యాక్టర్ కాకూడదన్న ఆలోచన వచ్చింది. ఆయనను అడిగితే అద్దంలో చూసుకున్నావా? అని అడిగారు. తర్వాత ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో చేరాను. గోల్డ్ మెడల్ వచ్చింది. ఆ తరువాత సినిమా కష్టాలు చాలానే పడ్డాను. 30 రోజులపాటు భోజనం లేదు. ఓ సందర్భంలో ఆత్మహత్య ఆలోచన కూడా చేశాను."












Click it and Unblock the Notifications