వైయస్ జగన్ పైనా ఐటి దాడులు?

గాలి జనార్దన్ రెడ్డిపై మాదిరిగానే జగన్ ఆస్తులపై కూడా ఐటి దాడులు చేయించాలని కాంగ్రెసు సీనియర్ నేతలు కె. కేశవరావు, వి. హనుమంతరావు తదితర సీనియర్ కాంగ్రెసు నేతలు సోనియా గాంధీని కలిసి కోరారని వినికిడి. ఈ విషయంపై ఆలోచిస్తానని సోనియా వారితో అన్నారని తెలుస్తోంది. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులపై బెంగళూర్, బళ్లారి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో పెద్ద యెత్తున సోమవారం ఐటి దాడులు జరిగాయి. ఇది జగన్ వర్గానికి పెద్ద షాక్ అంటున్నారు. కొద్ది రోజుల్లో వైయస్ జగన్ కు అదే పరిస్థితి ఎదురవుతుందని గిట్టనివారు వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications