కాంగ్రెసు వైపు చిరంజీవి స్టెప్స్, వైయస్ జగన్ తో బిగ్ ఫైట్

YS Jagan
ఇక జగన్ కు చిరంజీవికి మధ్య యుద్ధం సిద్ధమైనట్టే. జగన్ మొదట వృద్ధ సిఎం రోశయ్య మీద యుద్ధం ప్రకటించినప్పటికీ ఇప్పుడు తనకు ప్రధాన ప్రత్యర్ధి చిరంజీవి అన్న విషయం అర్ధమైంది. ఎన్నో కోట్లు వచ్చే సినిమా రంగాన్ని వదులుకుని ముఖ్యమంత్రి అవుదామనే ఆశతో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ నిర్ణయం చాలామంది అభిమానులకు నచ్చలేదు. ఎన్నికల ఫలితాలు నిరుత్సాహంగా ఉండడం, అల్లు అరవింద్ వంటి వారి ప్రమేయం ఎక్కువగా ఉండడంతో పవన కల్యాణ్, నాగబాబు ఆ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

చిరంజీవి ఇప్పుడు కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా జగన్ మీద డైనమిక్ గా పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే జగన్ క్యాంప్ లోని మేధావులు చిరంజీవి మీద సాక్షి పత్రికలోనూ, టీవీలోనూ కొన్ని స్టోరీలను ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. చిరంజీవి స్త్రీ లోలుడని, మందు బాబు అని కాకుండా, చిరంజీవి బ్లడ్, ఐ బ్యాంక్ ల మీద వాళ్ళు దృష్టి పెట్టారు. పిల్లికి బచ్చం పెట్టని వాడు నాయకుడు ఎలా అవుతాడాన్న విధంగా సాక్షిలో కథనాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెసు రెండు సార్లు అదికారంలోకి రావడానికి ఎంతో చేసిన తన తండ్రి వైఎస్ సేవలను మరిచిపోయి, చిరంజీవిని దగ్గరకు తీసుకోవడం సహజంగా ఆ వర్గానికి బాధ కలిగించే విషయమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+