పార్లమెంటు సభ్యురాలు, అందాల తార జయప్రదను నేటి తరం నటి జెనీలియాతో పోల్చడం సరి కాకపోవచ్చు గానీ అది తప్పడం లేదు. జెనీలియా మలయాళం సినిమాలో పోర్చుగీసు యువరాణి పాత్రను పోషిస్తోంది. 1980 దశకంలో ఎన్నో చిత్రాల్లో నటించిన జయప్రద ఇప్పుడు జెనీలియా రూటులోనే యువరాణి పాత్ర పోషించడానికి సిద్ధపడింది. జయప్రద నటించేది తెలుగు సినిమాలో కాదు, కన్నడ చిత్రంలో. కిట్టూరు అని పేరు పెట్టిన కన్నడ సినిమాలో జయప్రద యువరాణి పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో దర్సన్ హీరో పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంగోలి రాయన్న అని పేరు పెట్టారు. ఈ సినిమా చారిత్రక ఇతివృత్తంతో కూడుకుంది. సినిమాల్లో జయప్రద రీఎంట్రీకి ఇది మార్గం వేస్తోందా, చూద్దాం.