తండ్రి హరికృష్ణ గురించి, తన పెళ్లి విషయాల గురించి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓపెన్ గా మాట్లాడారు. ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆ విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. తన తండ్రి చాలా క్రమశిక్షణ గలవాడని, తాను అలా ఉండలేనని అన్నారు. తన తండ్రి హరికృష్ణ తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారని ఆయన చెప్పారు. రాత్రి ఏడు గంటలకే నిద్రపోతారని, ఎక్కువలో ఎక్కువగా 9 గంటల వరకు మెలుకువతో ఉంటారని, తాను అలా ఉండలేనని, ఒక్కోసారి టీవీ చూస్తూనో మరో పని చేస్తూనో రాత్రి గంటల వరకు కూడా నిద్రపోనని చెప్పారు. తన పెళ్లి గురించి కూడా అతను ఓపెన్ గా మాట్లాడారు. లక్ష్మీప్రసన్న గురించి చెబుతున్నప్పుడు అతని ముఖం వెలిగిపోవడం చూడవచ్చు. బృందావనం సినిమా చేస్తున్నప్పుడే పెళ్లి ఆలోచన వచ్చిందా అని అడిగితే అదేం లేదని అన్నాడు. బృందావనం సినిమాకు ముందే పెళ్లి నిశ్చయమైందని చెప్పారు. తన తల్లిదండ్రులకు నచ్చిందని, అందుకే పెళ్లికి ఒప్పుకున్నానని ఆయన చెప్పారు. తనకో భార్య, తన తల్లిదండ్రులకు మంచి కోడలు కావాలని తాను ఆలోచించానని, దానివల్లనే పెళ్లికి అంగీకరించానని ఆయన చెప్పారు. పెళ్లి ఎప్పుడో అందరికీ చెప్తానని ఆయన అన్నారు.