కెసిఆర్ తర్వాత కొడుకు కెటిఆరేనా?

K Chandrasekhar Rao
కెసిఆర్ రాజకీయ వారసుడెవరు? తెలంగాణ రాష్ట్రం వస్తే ఎస్సీ ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన ఆ మహానాయకుడు ఆ దిశగా ఒక ఎస్సీ నాయకుడిని ఇప్పుడే తన రాజకీయ వారసుడిగా ప్రకటించవచ్చు కదా? అలా ఎందుకు జరగడం లేదు? కెసిఆర్ వారసుడు ఆయన కుమారుడు కెటిఆరేనా? తన తండ్రి వారసుడు అన్న కె టిఆరేనని కెసిఆర్ కుమార్తె కవిత ఒక టీవీ చానల్ కార్యక్రమంలో చెప్పారు. కుటుంబంలో ఆ విషయం నిర్ధారణకు రాకపోతే ఆమె ఎందుకలా చెబుతారు?

అదుర్స్ సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నుంచి తాను డబ్బు తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణలను టిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె కవిత తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తమకు జిల్లాలను పంచి ఇచ్చారనే ఆరోపణలనూ కొట్టిపారేశారు. 2009 ఎన్నికలప్పుడు టికెట్ల విషయంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమ్మతో కలిసి తాను కేసీఆర్‌ను కోరినట్లు చెప్పారు. తాను, తన సోదరుడు రామారావు విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి రాష్ట్రానికి వచ్చామని చెప్పారు. ఈ విషయాలను ఆమె ఎబిఎన్ చానల్ ముఖాముఖిలో ఆమె వెల్లడించారు.

తన తండ్రి కెసిఆర్ రాజకీయ వారసుడు అన్న కెటిఆరే కానీ తాను కాదని ఆమె అన్నారు. అంతేకానీ తమ కుటుంబానికి చెందని మరో నాయకుడి ఊసుఎత్తలేదు. టిఆర్ ఎస్ లోనూ వారసత్వ పోకడలు ఉన్నాయని, కాంగ్రెస్ కు, తెలుగుదేశంకు తాము భిన్నం కాదని ఆమె చెప్పకనే చెప్పినట్టయింది. తన తండ్రి రాజకీయ నాయకత్వ పటిమను ఆమె మెచ్చుకుంటూనే, ఆయన పార్టీ శ్రేణులకు దూరంగా ఉంటున్నారనే ఆదే ఆయన లోపమని ఆమె అంగీకరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+