తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు సీమాంధ్రలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారు. నిరంతరం సీమాంధ్ర నాయకులపై విరుచుకుపడుతున్న ఆయన వారితో ఎలా వ్యాపారం చేస్తున్నాని ముక్కున వేలేసుకోవాల్సిన అవసరం లేదు. కెటిఆర్ స్వయంగా ఆయన చెప్పారు. ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం చెప్పారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి హైదరాబాదు వచ్చేసిన ఆయన తండ్రి వారసత్వాన్ని స్వీకరించడానికి తీవ్రంగానే చెమటోడుస్తున్నారు. ఆయనకు రెండు మూడు వ్యాపారాలున్నాయి. మిత్రులతో కలిసి సర్వీస్ అపార్టుమెంట్స్ పెట్టారు. కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉందట. తనకు సీమాంధ్ర భాగస్వాములున్నారని ఆయన అంగీకరించారు. అన్ని ప్రాంతాలవారు పార్టనర్స్ ఉన్నారట. తన సోదరి కవిత పార్టీలో లేరని చెప్పారు. ఒకవేళ ఆమె పార్టీలోకి వస్తే తాను త్యాగం చేసి తన సీటు ఆమెకు ఇస్తానని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీ చేసినా అభ్యంతరం లేదని చెబుతున్నారు. ఏమైనా, తండ్రి లక్షణాలను ఆయన పూర్తిగా పుణికిపుచ్చుకున్నట్లే ఉన్నారు.