పిసిసి రేసులో కెవిపి రామచంద్రరావు, సురేష్ రెడ్డి, కేశవరావు

కెవిపి రామచంద్రరావును పిసిసి అధ్యక్షుడిని చేస్తే జగన్ వర్గం వ్యతిరేకించదు. పైగా ఆయన ఆయన ఈమధ్య హైకమాండ్ కు వీర విధేయుడిగా మారారు. ఆయనకు కాంగ్రెస్ కు సంబంధించినంత వరకు కలెక్షన్ కింగ్ గా పేరుంది. వైఎస్ కు ఆప్త మిత్రుడైనా ఆయన మరణం తర్వాత కెవిపి జగన్ కంటే హై కమాండ్ కే చేరువయ్యారు. వైఎస్ ఉన్నప్పుడు కెవిపిని సంప్రదించనిదే ఆయన ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు. ఆ క్రమంలో ఆయన చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చేరువయ్యారు. కెవిపిని పిసిసి అధ్యక్షుడిని చేస్తే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారు. మాజీ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి, మాజీ పిసిసి అధ్యక్షుడు కె కేశవరావు కూడా పిసిసి రేసులో ఉన్నారు. ముగ్గురి ఇంటిపేర్లు కె తోనే ప్రారంభం కావడం విశేషం.












Click it and Unblock the Notifications