బాలయ్య నటన, లక్ష్మీపార్వతి మహానటన

లక్ష్మీపార్వతి స్వతహాగా బోళా మనిషి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె ద్వారా కోట్లు కొట్టేసిన వారు చాలా మంది ఉన్నారు. అన్ని మోసాలను చవి చూసిన ఆమె ఇప్పుడు ఆస్ధుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. నందమూరి అందగాళ్ళ మోసానికి బలికావద్దని ల.పాకి ( లక్ష్మీ పార్వతికి) ఆమె శ్రేయోభిలాషులు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. బసవరామతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఒక ట్రస్టు కింద ఉన్నప్పటికీ చాలా పెద్ద ఆస్ధి. ఆ ట్రస్టుకు ఎన్టీఆర్ భార్యగా లక్ష్మీపార్వతికి చెందుతున్నది. దీనిని బాలకృష్ణ కోర్టులో సవాలు చేశారు. మా నాన్నగారు లక్ష్మీపార్వతిని ఉంచుకున్నారే గానీ పెళ్ళి చేసుకోలేదన్న విధంగా కోర్టులో వాదనలు జరిగాయి. కానీ లక్ష్మీపార్వతికి అనుకూలంగా కేసు మలుపు తిరగడంతో బాలకృష్ణ ఆమెను కలుసుకుని నోరారా "అమ్మా" అంటూ సినిమా ఫక్కీలో పలకరించారు. బాలయ్య ఆమెను కలిసిన వార్తను లక్ష్మీ పార్వతి బాగా ఉపయోగించుకున్నారు. బాలకృష్ణ మాత్రం ప్రచారానికి దూరంగా ఉండిపోయారు. ఎందుకు? మరిన్ని వివరాలు రేపు....












Click it and Unblock the Notifications