సామాజిక సేవ మరువని హీరో పవన్ కల్యాణ్

అంత పెద్ద హీరో అయినా పవన్ కల్యాణ్ ఒక సినిమాలో ఒక చిన్న పాత్రకు అంగీకరించి చేస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? చిన్నపిల్లల కోసం. పవన్‌కల్యాణ్ ప్రధాన పాత్రధారిగా ఆదిత్య ప్రొడక్షన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏసుక్రీస్తు జీవితం ఆధారంగా బాల నటులతో రూపొందే చిత్రమిది. ఈ నెల 15 నుంచి ఇజ్రాయెల్ లో చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ఇందులో పవన్ పాత్ర ఏమిటన్న విషయాన్ని గోప్యంగా ఉంచారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు.
ఇంగ్లిష్‌తోపాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. నిర్మాత కొండా కృష్ణంరాజు మాట్లాడుతూ "ఇజ్రాయెల్‌లోని చారిత్రాత్మక ప్రదేశాల్లో చిత్రీకరణ ఉంటుంది. పవన్‌కల్యాణ్‌పై ముఖ్య సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. జెరూసలేంలోని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ దగ్గర చిత్రీకరణ చేసే సందర్భంలో ఈ కథాంశం ఏమిటన్నది ప్రసార మాధ్యమాల ద్వారా వెల్లడిస్తామ"న్నారు. రచన: జె.కె.భారవి, ఛాయాగ్రహణం: శేఖర్ వి.జోసెఫ్.












Click it and Unblock the Notifications