పవన్ పొలిటికల్ రీఎంట్రీ?

Pawan Kalyan
సినిమాల్లో నిండా మునిగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మళ్లీ వస్తారా? ఆయన బర్త్ డే సందర్బంగా ఈ విషయం చర్చకు వచ్చింది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. అవసమైనప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ కోసం పని చేస్తారని అల్లు అరవింద్ ఈ సందర్భంగా ప్రకటించారు. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ అన్నయ్యను అధికారంలో చూడాలని ఎన్నికల సమయంలో చెమటోడ్చారు. కానీ పార్టీలోని పరిణామాలు ఆయన తీవ్రంగా కలచివేసి పార్టీకి దూరమైనట్లు ప్రచారం జరిగింది. ఇటీవల విశాఖలో జరిగి పార్టీ ప్లీనరీ సమావేశానికి పవన్ గైర్హాజర్ చర్చనీయాంశంగా మారింది. అల్లు అరవింద్ పార్టీని నడిపించే దిశ ఇష్టం లేకనే పవన్ కళ్యాణ్ పార్టీకి దూరమైనట్లు వినికిడి. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ పార్టీకి తన సమయాన్ని వెచ్చించే పరిస్థితి లేదనే అంటున్నారు. అల్లు అరవింద్ మాటలు కేవలం అభిమానులను సంతృప్తి పరచడానికేనని చెబుతున్నారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ అభిమానులను తమ వెంట ఉంచుకోవడమే అల్లు అరవింద్ మాటల్లోని ఆంతర్యమనే మాట వినిపిస్తోంది. పైగా, పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ ల్లో నిండా మునిగి ఉన్నారు. పార్టీ వ్యవహారాలు నచ్చకనే ఆయన సినిమా మీద సినిమా అంగీకరిస్తూ బిజీ అవుతున్నారనే చెవులు కొరుక్కుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+