ఈ వయసులో ఎందుకిన్ని కష్టాలు?

రోశయ్యకు పెద్ద అవినీతిపరుడిగా పేరు లేదు. అలాగే పెద్ద పరిపాలనావేత్త కాదు. ఈ సమయంలో కాంగ్రెస్ హైకమాండ్ కు ఇటువంటివారే కావాలి. రోశయ్య విషయంలో చంద్రబాబు నాయుడు కూడా అంతగా నోరు పారేసుకోవడం లేదు. ఇది కూడా హై కమాండ్ వద్ద రోశయ్య స్కోరును పెంచింది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్ పన్నాగాలు పారలేదు. ఇప్పుడు డిఎస్ రోశయ్య మీద పరోక్ష దాడికి దిగారు. సోనియా గాంధీకి డిఎస్ అంటే ప్రత్యేక అభిమానం. ఆమె ఆయన మాటకు కొంత విలువ ఇస్తారు. డిఎస్ తెలంగాణ వాదం గురించి రోశయ్య వర్గీయులు ఒక వాణిని విన్పించినట్టు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు డిఎస్ తేలు కుట్టిన దొంగలా కన్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications