జగన్ యాత్రకు కెవిపి మద్దతు!

YS Jagan
తన ఆప్తమిత్రుడు వైఎస్సార్ తనయుడు జగన్ కు దూరంగా, ముఖ్యమంత్రి రోశయ్యకు దగ్గరగా కెవిపి రామచంద్రరావు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ఉంది. కానీ కెవిపి జగన్ ఓదార్పు యాత్రకు అనుకూలంగా అధిష్టానవర్గంపై వత్తిడి తేవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కడప ఎంపీ వైయస్ జగన్‌ ఓదార్పు యాత్రకు లైన్‌క్లియర్‌ చేయించేందుకు కాంగ్రెస్‌ లోని ముగ్గురు ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు. వైయస్ రాజశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానంలో కుడి ఎడమ భుజాలుగా ఉన్న రాజ్యసభ ఎంపీ డాక్టర్‌ కేవీపీ రామచంద్రరావు, పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌తో పాటు..మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ గత కొద్దిరోజులుగా ఓదార్పు యాత్ర అనుమతికి సంబంధించి అధిష్ఠా నం వద్ద లాబీయింగ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

వచ్చే నెల 8న వైయస్ జయంతి సందర్భంగా శ్రీకాకుళం నుంచి ఓదార్పు యాత్రను ప్రారంభించేందుకు జగన్‌ అన్ని ఏర్పాట్లు చేసు కుంటున్నారు. ఆ మేరకు ఆయన ఆ జిల్లా ఎమ్మెల్యేలు, డీసీసీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. అధిష్ఠానం నుంచి అనుమతి వస్తుందన్న ఆశాభావంతోనే జగన్‌ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగా.. 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలను శ్రీకాకుళం రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+