రాహుల్ గాంధీ కోసం రాణా 'లీడర్' స్పెషల్ షో

Rahul Gandhi
ఇప్పుడు దగ్గుబాటి రాణా పెద్ద హాట్ టాపిక్. ఈ రామానాయుడి మనవడిపై టాలీవుడ్ లో చాలా ఆశలు ఉన్నాయి. మీడియా ఫోకస్ కూడా బాగుంది. ఈ హీరో నటించిన తొలి సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల కాబోయే ప్రధానిగా వార్తల్లో ఉన్న రాహుల్ గాంధీ కోసం ఈ సినిమా ప్రత్యేక షోను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు సమాచారం. యువతరం రాజకీయాల్లోకి రావాలని ఎంతో కాలంగా రాహుల్ పిలుపు ఇస్తున్నారు. లీడర్ సినిమా ప్రస్తుత రాజకీయాలను ప్రతిబింబిస్తుంది. ఒక యువకుడు నిజమైన నాయకుడిగా ఎలా ఎదుగుతారో ఈ సినిమాలో చూపించారు.

గతంలో ఒకరోజు ముఖ్యమంత్రిగా అర్జున్ నటించి మెప్పించాడు. ఈ సినిమాకథ అందుకు కొంచెం భిన్నంగా ఉన్నా జనర్ అదే కావచ్చు. శేఖర్ కమ్ముల పూర్తి కథ తయారైతే కానీ షూటింగ్ కు వెళ్ళరు. కానీ ఈ సినిమా విషయంలో ఆయన స్క్రిప్టులో కొన్ని మార్పులు చేసుకోవచ్చింది. వర్తమాన రాజకీయాల్లో వేగంగా సంభవించిన మార్పులే అందుకు కారణం. ఈ సినిమా ఆడియో పెద్ద హిట్ అయింది. హీరోయిన్లుగా ప్రియా ఆనంద్, రిచా గంగోపాధ్యాయ నటిస్తున్నారు. మిక్కీ అందించిన సంగీతం పెద్ద హిట్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+