రాహుల్ గాంధీ శనివారం 19వ తేదీన 40వ సంవత్సరంలోకి పడ్డారు. ఆయన ఇప్పటికీ బ్రహ్మచారిగానే మిగిలారు. పెళ్లెప్పుడయ్యా అని మీడియా ప్రతినిధులు అడిగితే త్వరలోనే అంటాడు గానీ ఎప్పుడో చెప్పిన పాపాన పోలేదు. ఆయన ఓ స్పానిష్ గర్ల్ లేదా కొలంబియన్ గర్ల్ తో ప్రేమలో పడినట్లు గతంలో ప్రచారం జరిగింది. రాహుల్ త్వరలోనే తనను పెళ్లాడుతాడని ఆ ముద్గుగుమ్మ ఇప్పటికీ నమ్ముతోందట. రాజకీయాల్లో పీకల లోతు మునిగిపోయి, దళితుల ఇళ్లకు, విశ్వవిద్యాలయాలకు చెక్కర్లు కొడుతున్న రాహుల్ గాంధీ ఆ అమ్మాయిని మర్చిపోయాడా, మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాడా అనేది తేలడం లేదు. తన తల్లి సోనియా గాంధీ విదేశీయతనే తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు రాహుల్ గాంధీ విదేశీ వనితను పెళ్లి చేసుకుంటే దేశం గగ్గోలు పెడుతోందేమో. రాజకీయాల కోసం ప్రేమను త్యాగం చేయడానికి రాహుల్ సిద్ధపడ్డారా అనే అనుమానం కలగడంలో తప్పేమీ లేదు.