స్వామి నిత్యానందతో తాను శృంగారం జరిపినట్లు ఉన్న వీడియో నిజం కాదని తమిళ సినీ నటి రంజిత అంటోంది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని చెబుతోంది. నిత్యానంద తనను లైంగికంగా వేధించలేదని ఆమె సిఐడికిచ్చిన వాంగ్మూలంలో చెప్పింది.ఆయనతో తనకు శారీరక సంబంధమేదీ లేదని స్పష్టం చేశారు. ఆయన గదికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే వెళ్లానని చెప్పింది. అయితే, ఆ వీడియో అసలైనదేనని ఫోరెన్సిక్ లేబరేటరీ తేల్చంది. రంజిత బుకాయిస్తోందని సిఐడి వర్గాలు భావిస్తున్నాయి. కాగా, నిత్యానంద స్వామి రంజితను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. రంజిత మంచి భక్తురాలని అతను అన్నాడు. అనవసరంగా రంజితను బద్నాం చేశారని అన్నాడు. ఆమె కుటుంబానికి క్షమాపణలు కూడా చెప్పాడు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు.