ముఖ్యమంత్రి కె. రోశయ్య వ్యాఖ్యలు కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందినవారిని ఉద్దేశించి చేసినవేనని భావిస్తున్నారు. కొంత మంది నాయకులు వైయస్సార్ పై తమకు ఎనలేని అభిమానం ఉందని చెప్పుకుంటున్నారని, కానీ వారికి ఆ అభిమానం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కు తాను నిజమైన అభిమానిని అని చెప్పుకున్నారు. వైయస్సార్ ను ప్రజలు అభిమానిస్తున్నారు కాబట్టి వైయస్సార్ పట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని, లేకుంటే ఆ పని చేసి ఉండేవారు కారని ఆయన వ్యాఖ్యానించారు. తాను అబద్ధాలు చెప్పనని, తాను అభిమానిస్తే అబిమానిస్తానని చెబుతానని, పులివెందుల నుంచి వైయస్సార్ మొదటి సారి పోటీ చేసిన సమయంలో తాను ప్రచారానికి వెళ్లానని, వైయస్సార్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు. వైయస్సార్ పేదలకు చేసిన మేలుకు అత్యంత ఎక్కువగా అభిమానించే వ్యక్తిని తానేనని ఆయన చెప్పుకున్నారు. ఈ మాటలన్నీ ఆయన వైయస్ జగన్ వర్గాన్ని ఉద్దేశించి అన్నవేనని భావిస్తున్నారు. పరోక్షంగా వైయస్ జగన్ వర్గాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడినట్లు చెబుతున్నారు.