బాలీవుడ్ నటి సమీరా రెడ్డి ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు ఫిదా అయిపోయారు. గౌతం మీనన్ తీసిన సినిమా విడుదల కోసం సమీరా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. ఇందులో డిఫరెంట్ సమీరాను చూస్తారని గౌతం మీనన్ అంటున్నారు. ఇది మిగతా సినిమాల వంటిది కాదని, ఈ సినిమాలో తనను నటనను, ఉద్వేగాలను ప్రదర్శించడానికి వీలైందని సమీరా చెప్పుకుంటోంది. ఆమెకు ఉత్తర, దక్షిణ ప్రాంతాల సినిమాలు సమానంగా నచ్చుతాయట గానీ దక్షిణాది అభిమానులు ఎంతో బెటర్ అని ఆమె అంటోంది. దక్షిణాది అభిమానులు భలే ఉంటారని, తమ అభిమానుల నటుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారని అంటూ చిరంజీవి అభిమానుల గురించి, రజనీకాంత్ అభిమానుల గురించి ఆమె పొగిడేశారు. విరాళాల ద్వారా, రక్తదానం ద్వారా వారు ప్రజలకు సాయం కూడా చేస్తారని అంటోంది. చిరంజీవి ఫ్యాన్స్ ప్రజల కోసం ఎంతో చేస్తారని ఆమె అంటోంది. చిరంజీవి రాబోయే 150వ సినిమాలో పాత్రను ఆశిస్తుందా అనుమానం సమీరా మాటల్లోని ఆంతర్యం కాబోలు అని అనుకుంటున్నారు.