వెలుగులోకి వచ్చిన 'హెచ్ వై టీవీ'

తెలుగులో ఇప్పటికే పదమూడు న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. ఒక్క ఐదు ఛానెల్ మాత్రమే ఆర్ధికంగా నడిచే అవకాశం ఉంది. మిగతావన్ని నష్టాల్లోనే ఉన్నాయి. అందులో హెచ్.వై ఛానెల్ పదమూడో స్ధానంలో ఉంది. అయితే శివరామప్రసాద్ తనకున్న జర్నలిస్టు అనుభవంతోపాటు, ఎడ్వర్టటైజింగ్ ఏజన్సీ నడుపుతున్న అనుభవంతో ఈ ఛానెల్ ను కొంచెం ముందుకు తీసుకువెళ్ళగలడన్న నమ్మకం ప్రమోటర్స్ లో ఉంది. ఇప్పటికి టీవీ నైన్ టాప్ రేటింగ్ లో ఉంది. టాప్ త్రీ లో ఎన్.టివీ, టీవీ ఫైవ్ ఉన్నాయి. వారికి లాభాల సంగతి ప్రక్కన పెడితే జీతాలు ఇవ్వగలగిన యాడ్ రెవిన్యూ వస్తోంది. మిగతా ఎనిమిది ఛానెల్స్ ఎన్నికలు దగ్గర అయితే మాత్రమే నడవగలవాయి. ఈలోపు వాటికి కూడా ఆర్దికంగా ఇబ్బందులే. కానీ ఎన్నికలు మరో మూడున్నర ఏళ్ళదాకా వచ్చే పరిస్ధితి కనపడటం లేదు.
హెచ్ వై ఛానెల్ మౌళికంగా న్యూస్ ఛానెల్. ఇప్పటివరకూ దానికి పెద్ద పేరు రాకపోవటం కొంత ఇబ్బందికరమే.చిట్టచివరి స్ధానంలో ఉన్న ఈ ఛానెల్ ని శివరామప్రసాద్ ఏ విన్యాసాలు చేసి గట్టెక్కించగలరో చూడాలి.












Click it and Unblock the Notifications