స్ధానిక ఎమ్మెల్యే చిరంజీవిని గౌరవించని టిటిడి!

Chiranjeevi
సొంత జిల్లా పశ్చిమగోదావరిలో ఓడిపోయినా పరాయి ప్రాంతమైన తిరుపతిలో గెలుపొందిన చిరంజీవికి అక్కడ కూడా పెద్ద పెద్ద మర్యాదలు కన్పించడంలేదు. స్దానిక ఎమ్మెల్యే ఐనా ఆయన తనకు సరైన ఆలయ మర్యాదలు లభించలేదని ఒకటి రెండు సందర్భాల్లో టిటిడి ఆలయ అధికారులపై ఆయన అసహనం వ్యక్తం చేసిన సంగతి చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

తాజాగా శ్రేకృష్ణ దేవరాయల జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. తిరుమలకు రాయలు ఎంతో చేశారు. టిటిడీ నిర్వహిస్తున్న రాయల జయంతి ఉత్సవాల్లో స్ధానిక ఎమ్మెల్యే అయిన చిరంజీవి పేరును ప్రస్తావించకపోవడంపై స్ధానిక ప్రజారాజ్యం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు ఇప్పటి కర్ణాటక రాజధానిగా ఆంధ్ర, ఒరిస్సా వరకు తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నా ఆయన పూర్వీకులు అచ్చ తెలుగు వాళ్ళని అనేక మంది చరిత్రకారులు తేల్చారు. ఆయన బలిజ అన్న విషయంలో ఎక్కువ మంది చరిత్రకారులు అంగీకరించారు. అంతటి మహా చక్రవర్తి మావాడే కావచ్చునని కొందరు కమ్మ చరిత్రకారులు కాస్త సందేహాస్పదంగా చెబుతూనే ఆయన యాదవ అయి కూడా ఉండవచన్నారు.

చిరంజీవి తిరుపతిలో విజయం సాధించడం వెనుక బలజ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది. ఇప్పుడూ ఆ ఫ్యాక్టర్ శ్రీకృష్ణ దేవరాయల విషయంలో ఇంకా బాగా పనిచేస్తోంది. సినిమా హీరో అయిన చిరంజీవికి చరిత్ర గురించి పెద్దగా తెలియకపోయినా అయనకు ఎవరైనా ఒక విషయాన్ని వివరిస్తే ఆయన ఒప్పుకుని ఆ విషయంపై కొద్దిగా మాట్లాడుతారు. ఇప్పటి విషయం తనకు ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ మర్యాదలు లభించడం లేదని.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+