సినిమాగా వంగవీటి మోహన రంగా కథ?

కాపు, ఇతర అణగారిన వర్గాల గ్యాంగ్ లీడర్ అయిన రంగా కమ్మ కులానికి చెందిన రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, గ్యాంగ్ వార్ లో మరణించిన అన్న పేరు కొడ్డుక్కి పెట్టుకోవడం, కమిషనర్ గా వచ్చిన కెఎస్ వ్యాస్ రంగాను తిప్పలు పెట్టడం, ఆ తర్వాత నిరాహారదీక్షా శిబిరంలోనే హత్యకు గురికావడం, పర్యవసానంగా కింది వర్గాల ప్రజల ఒక భూస్వామ్య కులంపై దాడు చేయడం ఎంతో ఉత్కంఠ భరితమైన అంశాలు రంగా కథలో ఉన్నాయి. 'వెన్నెల', 'ప్రస్ధానం' దర్శకుడు దేవా కట్టా ఈ సినిమా తీయడానికి పని ప్రారంభించినట్టు సమాచారం. ఇటువంటి సినిమాలకు నిర్మాతలు దొరకడం కష్టమే. దొరికితే మాత్రం తమిళ యాక్షన్ సినిమాల రేంజ్ లో ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications