కెసిఆర్ కు విజయశాంతి వెక్కిరింత!

Vijayashanthi
టిఆర్ ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావుతో ఆ పార్టీ ఎంపీ విజయశాంతికి మొదటి నుంచి సయోధ్య కుదరడం లేదు. రాజకీయంగా వారిద్దరిదీ కలహాల కాపురమే. మెదక్ నుంచి తాను తన ప్రతిభతో గెలుపొందానని, ఇందులో కెసిఆర్ పాత్ర అత్యల్పమని ఆమె తన సన్నిహితుల వద్ద బాహాటంగానే చెబుతున్నారు. ఆ విషయం తెలిసినా కెసిఆర్ తెలియనట్టు ఉంటున్నారు. తాజాగా కెసిఆర్ విజయవాడలో ప్రత్యేకాంధ్ర సమావేశానికి వెళ్ళడానికి నిర్ణయించుకోవడం రాములమ్మకు ఒళ్ళు మండింది. పార్టీ పొలిట్ బ్యూరో లో చర్చించకుండా ఆయన ఏకపక్షంగా ఆ నిర్ణయం తీసుకోవడం దారుణమని ఆమె అభిప్రాయం. చంద్రశేఖరరావును ఆమె పార్టీ అధినేతగా చూడకుండా తనతో పాటు గెలిచిన ఎంపీగా పరిగణిస్తున్నారు.

ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఒక రూపునకు రాకముందే చంద్రశేఖరరావు విజయవాడలోని ఆ సమావేశానికి వెళ్ళడానికి నిర్ణయం తీసుకోవడం హార్డ్ కోర్ తెలంగాణ వాదులకు రుచించడం లేదు. కామీ శ్రీకృష్ణ కమిషన్ దృష్టిలో మంచి మార్కులు కొట్టేయడానికే కొందరు మేధావులు ఇచ్చిన సూచనను కెసిఆర్ పాటించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో మెదడు తక్కువ వాళ్ళు చేసే విమర్శలను ఆయన పట్టించుకునే స్ధితిలో లేరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+