విజయశాంతి దృష్టిలో 'దమ్ము' అంటే?

తెలంగాణ ఉప ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్ కెసిఆర్ తర్వాత పెద్ద ఆకర్షణ విజయశాంతే. ఆ ప్రచారం కోసం ఆమె ఇప్పటి నుంచే అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగమే ఇటీవల ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ. అందులో ఆమె ధైర్యంగా "తెలుగు సినిమా హీరోలకు దమ్ము ధైర్యం లేవు, ఇద్దరు హీరోలకు తప్ప" అన్న బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఆమె దృష్టిలో దమ్మున్న ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే ఒకరు ఎన్టీఆర్, మరొకరు కృష్ణ.
ఇతర హీరోలను పిరికిపందలుగా సృష్టించి వాళ్ళ బట్టలూడదీసినంత పనిచేసింది విజయశాంతి. తెలంగాణ ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె చిరంజీవి పిరికితనాన్ని, ఆయన తెలంగాణ వ్యతిరేక విధానాన్ని ప్రధానంగా విమర్శించి ఓటర్లను అలరించాలనుకుంటున్నట్టు సమాచారం. మంచిదే, ఎవరి పాత్ర వాళ్ళు వేయాలి కదా!












Click it and Unblock the Notifications