చిరంజీవికి మెగా గాలం

ముద్దు వచ్చినప్పుడు చంకన ఎక్కడం సముచితమన్న పాలసీ చిరంజీవిది. ఎటూ సోనియా పిలిచారు కాబట్టి తన సత్వర టార్గెట్ ను ఆమె ముందు ఉంచడానికి ఆయన ప్రయత్నించారు. ఏమిటా టార్గెట్? బామ్మర్ది అల్లు అరవింద్ కు రాజ్యసభ సభ్యత్వం ఇప్పించుకోవడం. సొంతబలంతో అది సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెసు మద్దతుతో దానిని సాధించుకోవడం. ఇంత చిన్న టార్గెట్ లు పెట్టుకోవద్దని, కాంగ్రెసుకు మద్దతు ఇస్తే ఇంకా పెద్ద టార్గెట్లు సాధించుకోవచ్చని ఆమె నర్మ గర్భంగా చిరంజీవి సూచించినట్టు విశ్వసనీయంగా తెలిసంది. రాష్ట్రంలో వైఎస్ లేని కాంగ్రెసు ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి చిరంజీవి అవసరం ఉందని కాంగ్రెసు హై కమాండ్ భావిస్తోంది. వీలుంటే ఉప ఎన్నికలకు ముందే చిరంజీవిని కాంగ్రెసులోకి లాగేసుకోవాలన్న ఆత్రం సోనియా గాంధీలో కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications