కాబోయే సిఎం బాబా? జగనా?

అయితే ఎన్టీఆర్ మూడు దశాబ్దాల క్రితం వేసిన విత్తనాల ఫలితంగా తెలుగుదేశం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బలంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో అయినా వందకు తగ్గకుండా సీట్లు తెచ్చుకునే సత్తా టిడీపికి ఉంది. అయితే అంతకంటే ఎక్కువ తెచ్చుకుని అధికారంలోకి రావాలంటే చంద్రబాబు నాయుడు బ్యురాక్రాట్ అవతారం వదిలి "లీడర్" పాత్ర ధరించాలి. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పెంపొందించాలి.
వచ్చే ఎన్నికల్ల్లో కూడా అంటే చంద్రబాబు నాయుడికి 64 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు హయాంలో ఆ పార్టీ ప్రగతి మందగించిపోయిందని, ఆయన కొత్త పథకాలతో ముందుకు రావాలని అంటున్నారు. అయితే ఆయన గత ఎన్నికల్లో ప్రకటించిన కొత్త పథకాలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇక జగన్ కు "లీడర్" సినిమా దెబ్బ తగిలే అవకాశముంది. లీడర్ రాణాలాగా తన తండ్రి సంపాదించిన వేలాది కోట్లను జగన్ ప్రజలకు ఇవ్వలేదన్న ఫీలింగ్ ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications