బాలయ్యకు బ్రేకులు!

ఇప్పుడు బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. జాతకరీత్యా కూడా అన్ని దుష్ట దశలను దాటి ఒక మంచి స్ధితికి వచ్చినట్టు కన్పిస్తోంది. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకోవాలన్న ప్రగాఢ వాంచ అతనిలో కన్పిస్తోంది. అయితే సినిమా ఫక్కీ ట్విస్ట్ లు ఎన్నో ఉన్నాయి. చంద్రబాబుతో వియ్యం అందుకోవడంతో అయనను రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేని పరిస్ధితి. అందువల్ల ముఖ్యమంత్రి పదవికి కాకుండా రాజ్యసభ సభ్యత్వంతో సరిపెట్టుకుంటున్నాడు. అయితే ఎన్టీఆర్ స్ధానంలో ఉండాల్సింది బాలకృష్ణే కానీ చంద్రబాబు కాదన్న అభిప్రాయం సామాన్య ప్రజల్లో ఉందన్న విషయం నిన్న వేదాద్రిలో నిరూపితమైంది. బాలకృష్ణను దగ్గరగా చూడాలన్న కోరికతో ముందుకు వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు (సినిమా అభిమానులు కాదు) లాథీచార్జిలో గాయపడవలసి వచ్చింది. టర్న్ అరౌండ్ అయిన బాలకృష్ణ గురించి మరిన్ని విశేషాలు ఇదే కాలంలో ఈ వారంలోనే అందిస్తాం.












Click it and Unblock the Notifications