చంద్రబాబు అంత పిరికా?

సరే, మూడెకరాల చంద్రబాబు నాయుడు రెండు వేల కోట్లకు (అది కూడా పదేళ్ళ క్రితం తెహల్కా డాట్ కాం అంచనా) ఎలా పడగెత్తారు? వైయస్ రాజశేఖరరెడ్డి యాభై వేల కోట్లకు పడగెత్తి ప్రమాదంలో మరణించారన్నది మరో ఆరోపణ. ఇలా రాజకీయ నాయకులు ఇన్ని వేల కోట్లు కొట్టేస్తూ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఎంతవరకు సబబు? పోనీ తెలంగాణ కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్న కెసిఆర్ పరిశుద్ధుడా?
ఈ విషయాన్ని ఈ టీవీ చానల్స్ బాబుని, జగన్ ని, రోశయ్యని, కెవిపిని, కెసీఅర్ ని, ఆయన పుత్రరత్నం కెటీఆర్ ని చర్చల్లో నిలదీయాల్సిన అవసరముంది. మరి వాళ్ళు ఆ పని ఎందుకు చేయడం లేదు? రెండో, మూడో స్ధాయి నాయకులను ఎందుకు ముందుకు తెస్తున్నారు?












Click it and Unblock the Notifications