చిరంజీవి సినిమాల్లోకి తిరిగి రానున్నారా?

చిరంజీవి తనకెంతగానో కలిసొచ్చిన సినిమా రంగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి తన కుటుంబంలోని యంగ్ తరంగ్ హీరోలకు దారి ఇవ్వాలన్నది. మరి ఇప్పుడు ఆయన సినిమాల్లో నటిస్తే వారి దారి సన్నదై పోదా? ముమ్మటికీ పోదు. ఎందుకంటే చిరంజీవి తాను మాత్రమే చేయగల చారిత్రక, ఆఫ్ బీట్ సినిమాల్లో నటించాలనుకుంటున్నారు. ఎన్టీఆర్ కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించి తన అభిమానుల అభిమానాన్ని కొనసాగించుకున్నారు. చిరంజీవి కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా నిర్మించే చిత్రంలో నటించాలని చిరకాలంగా అనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కల నెరవేరే సమయం ఆసన్నమైనట్టే కన్పిస్తోంది.












Click it and Unblock the Notifications