ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఆయన బావమరిది, నిర్మాత అల్లు అరవింద్ ఎప్పటికప్పుడు అడ్డు తగులుతూనే ఉన్నాడనేది చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి వ్యవహారాల్లో పవన్ కళ్యాణ్‌కు ఏ మాత్రం స్థానం లేకుండా ఎప్పటికప్పుడు చూస్తున్నారట. తాజాగా పవన్ కళ్యాణ్ తలపెట్టిన అభిమానుల సమావేశం వాయిదా పడడానికి అల్లు అరవింద్ కారణమని అంటున్నారు. చిరంజీవి అభిమానుల సమావేశంలో పవన్ కళ్యాణ్ తొలుత మాట్లాడాల్సి ఉంది. అయితే, అది వాయిదా పడింది. చిరంజీవి, అల్లు అరవింద్ అభిమానుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ సమావేశానికి రానే లేదు. చిరంజీవి రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ జోక్యం అల్లు అరవింద్‌కు నచ్చడం లేదని, చిరంజీవిని పవన్ కళ్యాణ్ ప్రభావితం చేసే అవకాశం ఇవ్వకూడదని, రాజకీయంగా పవన్ కళ్యాణ్‌కు ప్రాధాన్యం లభిస్తే తన ఎత్తులు పారవని అల్లు అరవింద్ ఆలోచిస్తున్నారట. అల్లు అరవింద్ ఒక పద్ధతి ప్రకారమే చిరంజీవిని కాంగ్రెసు వైపు నడిపించినట్లు చెబుతున్నారు.
It is learnt that Due to Allu Aravind Pawan Kalyan's meeting with fans was postponed. Allu Aravind did not want any role of Pawan Kalyan in Chiranjeevi's affairs.