బావను కొట్టబోయి బోర్లా పడ్డ బావమరిది!

మగధీర రికార్డులు బద్దలు కొట్టే ఉద్దేశ్యంలో భాగంగానే అల్లు అరవింద్ తన తనయుడు అల్లు అర్జున్‌తో బద్రినాథ్ చిత్రం తీశారనే వాదనలు వినిపించాయి. సినిమా విడుదల సమయంలో సైతం మగధీరలా రికార్డులు సృష్టిస్తుందని పలువురు చెప్పారు. కానీ తీరా విడుదలయ్యాక బాక్పాఫీసు ముందు బోర్లా పడింది. భారీ చిత్రాల దర్శకుడు వి వినాయక్ బద్రీనాథ్ చిత్రాన్ని తెరకెక్కించినప్పటికీ ఆ చిత్రం మగధీరను కొట్టలేక పోయింది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, అశ్వనీదత్ నిర్మాణంలో, మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన శక్తి సైతం మగధీరను కొట్టాలనుకున్న ఉద్దేశ్యంతో వచ్చిందనే భావన అందరిలోనూ ఉంది. కానీ అదీ బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.












Click it and Unblock the Notifications