వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనిల్ లగడపాటి తెలంగాణ కోవర్టా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagaadapati Rajagopal
ఇటీవల హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత, చేదు అనుభవాన్ని చవి చూసిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు అనిల్ కుమార్ తెలంగాణ జెఎసిపై నిప్పులు చెరుగుతున్నారు. తెలంగాణ జెఎసి అగ్రవర్ణాల గుప్పిట్లో ఉందంటూ తన అక్కసంతా వెళ్లగక్కారు. తాను తమ పార్టీ అధ్యక్షుడు చిరంజీవినే ఎదిరించి, తెలంగాణవాదిగా ఉన్నానని చెప్పుకున్నారు.

అనిల్ కుమార్‌ను తెలంగాణవాదులు చెప్పులతో కొట్టిన విషయం తెలిసిందే. అయితే, అనిల్ కుమార్ సీమాంధ్ర కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు తెలంగాణలో కోవర్టుగా పనిచేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్ 2009లోనే లగడపాటికి అమ్ముడుపోయారట. అనిల్ కుమార్ గారు స్ట్రక్చర్స్ 18 అనే సంస్థను సంపాదించి పనులు దొరక్క చతికిలపడిపోతున్న సమయంలో లగడపాటి రాజగోపాల్‌ను ఆశ్రయించినట్లు చెబుతున్నారు.

నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ సహకారంతో లడపాటి రాజగోపాల్ ల్యాంకో గ్రూప్ నుంచి ఓ ప్రాజెక్టును తీసుకున్నాడని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ శాసనసభ్యుడు అనిల్ కుమార్‌కు లగడపాటి 45 కోట్ల ప్రాజెక్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ స్థితిలో కోవర్టుగా తెలంగాణ ఉద్యమంలోకి ప్రవేశించే ప్రయత్నాలు విఫలం కావడంతో తెలంగాణ జెఎసిపై అనిల్ విరుకుచుపడుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. చిరంజీవికి కూడా అనిల్ కుమార్ విధేయతతో లేరని చెబుతారు. ప్రజారాజ్యం ప్రభుత్వంలో చేరుతుందనే ప్రచారం ముమ్మరంగా జరుగుతున్న సమయంలో మంత్రి పదవి కోసం రాహుల్ గాంధీని ఆశ్రయించే ప్రయత్నాలు కూడా చేసినట్లు చెబుతున్నారు. అనిల్ కుమార్‌పై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియదు గానీ నిప్పు లేనిదే పొగరాదని అనే పెద్దల మాటను గుర్తు చేసుకోక తప్పదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X