మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ వ్యవహారం అదిగో పులి కథలా తయారైంది. అప్పుడప్పుడు భాను కిరణ్ దొరికినట్లు వార్తలు రావడం, వాటిని పోలీసులు ఖండించడం మామూలై పోయింది. ఇటీవల సినీ నిర్మాతలు సి. కళ్యాణ్, శింగనమల రమేష్ అరెస్టు వ్యవహారాల సమయంలో కూడా భాను కిరణ్ ఆచూకీపై పుకార్లు షికార్లు చేశాయి.
తాజాగా సిఐడి భాను కిరణ్ పేరును మోస్ట్ వాంటెడ్ జాబితాలో నెంబర్ వన్‌గా చేర్చింది. పది మంది మోస్ట్ వాంటెడ్ జాబితాలో అతని పేరు మొదట ఉంది. పది అవతారాల్లో ఉన్న భాను కిరణ్ ఫోటోలను రూపొందించి సిఐడి అన్ని విమానాశ్రయాలకు పంపింది.