ప్రముఖ సినీ తార భూమిక చావ్లా పెళ్లి పెటాకులయ్యే పరిస్థితి వచ్చింది. ఆమె నాలుగేళ్ల క్రితం యోగా గురు భరత్ ఠాకూర్‌ను పెళ్లాడిన విషయం తెలిసిందే. అతనితో విడాకులు కోరుతూ భూమిక ఇటీవల పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆమె నిర్ధారించడం లేదు. కానీ, ఆమెకు అత్యంత సన్నిహితుల ద్వారా ఆ విషయం బయటపడింది. నిరుడు ఫిబ్రవరి నుంచి ఇరువురు విడివిడిగా జీవిస్తున్నారట. మరో మహిళతో భరత్ ఠాకూర్ సంబంధాలు పెట్టుకున్నాడట. పైగా ఆమెకు దూరం కావడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. దీంతో భూమిక విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారని వినికిడి. భూమిక తన తల్లిదండ్రులతోనే ఉంటుంది. భరత్ ఠాకూర్ ఆమెకు మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నాలు చేశాడని సమాచారం. అయితే భూమిక తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేదని అంటున్నారు.
All is not well in Bhumika Chawla's world. The actress who got married to yoga guru Bharat Thakur four years ago is filing for divorce. Though the actress is yet to go on record about this, a close friend has confirmed the news.