శాసనసభలో
తెలంగాణ
తీర్మానం
ప్రతిపాదించాలని
డిప్యూటీ
స్పీకర్
నాదెండ్ల
మనోహర్‌ను
కోరాలనే
తెలుగుదేశం
సీమాంధ్ర
శాసనసభ్యుడు
పయ్యావుల
కేశవ్
ఆలోచన
వెనక
ఆ
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబునాయుడు
ఉన్నారనే
అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెసు
పార్టీని
ఇరకాటంలో
పెట్టడానికి
ఆయన
ఈ
ఆలోచన
చేస్తున్నట్లు
చెబుతున్నారు.
తన
రెండు
కళ్ల
సిద్ధాంతం
వల్ల
తమ
పార్టీకి
వచ్చే
నష్టమేమీ
లేదని,
కాంగ్రెసు
తెలంగాణకు
వ్యతిరేకంగా
ఉందని
చూపించాలని
ఆయన
ఆలోచిస్తున్నట్లు
చెబుతున్నారు.
శాసనసభలో
తెలంగాణ
తీర్మానం
ప్రతిపాదిస్తే
కాంగ్రెసు
పార్టీలో
చీలిక
వస్తుందని
ఆయన
అంచనా
వేస్తున్నారట.
దానివల్ల
మాజీ
పార్లమెంటు
సభ్యుడు
వైయస్
జగన్
వైఖరి
కూడా
తేటతెల్లమవుతుందని
భావిస్తున్నారట.
కాంగ్రెసు,
వైయస్
జగన్
తెలంగాణ
వ్యతిరేక
వైఖరి
బయటపడుతుందని,
తాను
తెలంగాణ
వ్యతిరేకిననే
నింద
నుంచి
బయట
పడడానికి
వీలవుతుందని
చంద్రబాబు
భావిస్తున్నట్లు
సమాచారం.
ఇది
ఎటు
పయనిస్తుందో
వేచి
చూడాల్సిందే.
It is said that TDP president N Chandrababu Naidu is going to use his Seemandhra MLA to expose Congress anti Telangana stand. Payyavula Keshav is in a mood appeal to deputy speaker Nadendla Manohar to propose Telangana resolution.
Story first published: Tuesday, February 22, 2011, 9:48 [IST]