బాబుకు ఢిల్లీ కాల్ ఎవరి నుంచి?

అన్నా అరెస్టుపై ఏ మాత్రం చర్చించకుండానే ఐదు నిమిషాల్లోనే రోడ్డుపైకి నాయకులతో పాటు దారి తీశారని అంటున్నారు. చంద్రబాబు అకస్మాత్తు నిర్ణయానికి పార్టీ నాయకులు కూడా బిత్తరపోయారని అంటున్నారు. ఢిల్లీ అంతా ఉడికిపోతుంటే అలా చర్చలు అంటూ కూర్చోవడం పనికి రాదని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు వెంటనే రోడ్డుపైకి రావాలని చంద్రబాబుకు ఆ జాతీయ నాయకుడు నూరిపోసిన వైనమే దీనికి దారి తీసిందని అంటున్నారు. ఇంతకీ ఆ జాతీయ నాయకుడు ఎవరనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.












Click it and Unblock the Notifications