జూ ఎన్టీఆర్‌కు చంద్రబాబు భయపడ్డారా?

మహానాడు చివరి రోజు వేదికపై నందమూరి కుటుంబ సభ్యుల ఫ్లెక్సీలను పెట్టారు. అంతేకాకుండా, నారా లోకేష్ రాజకీయాల్లోకి రావాలంటూ తీర్మానం చేసిన చిత్తూరు జిల్లా నాయకులపై ఆయన అగ్గి మీద గుగ్గిలమయ్యారు. చంద్రబాబు ప్రసంగం కూడా చివరి రోజు కొంత ఆత్మపరిశీలన పద్ధతిలో సాగింది. స్వర్గీయ ఎన్టీఆర్‌ను గద్దె దింపడం తప్పేనని అంగీకరించారు. అయితే, ఆ దుష్టశక్తి నుంచి పార్టీని కాపాడుకోవడానికి అది తప్పలేదని సమర్థించుకున్నారు. ఈ మాటలు హరికృష్ణను మెప్పించడానికి మాత్రమేనని అంటున్నారు. ఏమైనా, జూ. ఎన్టీఆర్, హరికృష్ణ దెబ్బకు బాబు వెనక్కి తగ్గక తప్పలేదు.












Click it and Unblock the Notifications