వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కన్నడ స్వయంకృషిలో 'చిరు' రోల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
మెగాస్టార్ చిరంజీవి మరోసారి కన్నడ సినిమాలో నటిస్తున్నారు. ఇంతకు ముందు ఆయన కన్నడ క్రేజీ స్టార్ వి. రవిచంద్రన్‌కు చెందిన సిపాయి సినిమాలో నటించారు. ఇప్పుడు వీరేంద్ర బాబుకు చెందిన స్వయంకృషి కన్నడ సినిమాలో అతిథి పాత్రలో చిరంజీవి నటించడానికి అంగీకరించారు. చిరంజీవికి సంబంధించిన షూటింగు త్వరలోనే జరుగుతుందని నిర్మాత, నటుడు, దర్శకుడు వీరేంద్ర బాబు చెప్పారు. అంబరీష్ సుమన్, బ్లాయెంకా దేశాయ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. స్వయంకృషి పేరుతో తెలుగులో వచ్చిన సినిమాలో చిరంజీవి హీరో పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అదే పేరుతో కన్నడంలో వస్తున్న సినిమాలో చిరంజీవి గెస్ట్ రోల్ పోషిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత చిరంజీవికి వెసులుబాటు లభిస్తోంది. దీంతో తనకు ఇష్టమైన సినిమా రంగంపై చిరంజీవి దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.

English summary
The telugu mega star Chiranjeevi has agreed to act in his Second Kannada film 'Swayamkrishi' of Veerendra Babu. It is a short and sweet role. After 'Sipayi' with crazy star V. Ravichandran the Telugu star in Again in Kannada.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X