చిరంజీవి 'తప్పు'లో కాలేశారా?

Chiranjeevi
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన సమయంలో చిరంజీవి తప్పులో కాలేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కీలకమైన సమయంలో షరతులు పెట్టి కాంగ్రెసు పెద్దలకు చెమటలు పట్టించి, తన రాజకీయ చతురతను ప్రదర్శించారని చిరంజీవిపై తొలుత ప్రశంసలు వెల్లువెత్తాయి. కానీ, అది బెడిసికొట్టే ప్రమాదం ఉందనే మాటలు ఇప్పుడు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. తన శానససభ్యులకు పట్టించుకోవడం లేదంటూ అవిశ్వాస తీర్మానం విషయంలో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి చిరంజీవి కాంగ్రెసు అధిష్టానం వద్ద షరతులు పెట్టి బతిమాలించుకున్నారు. అధిష్టానానికి చెందిన గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్ ఆయనను తీవ్రంగా బుజ్జగించాల్సి వచ్చింది. పరిస్థితిని అంత దాకా రానీయడం చిరంజీవికే నష్టం కలిగించిందని అంటున్నారు.

చిరంజీవి బ్లాక్ మెయిల్ చేశారనే ఉద్దేశంతో అధిష్టానం నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. ఇటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో అధిష్టానం మొదటి నుంచీ ఉంది. ఇటువంటి బ్లాక్ మొయిల్ రాజకీయాల వల్లనే అత్యంత బలవంతుడిగా పేరు పొందిన వైయస్ జగన్‌ను అధిష్టానం దూరం చేసుకుంది. శరద్ పవార్ లాంటి బడా నేతలను కూడా పక్కన పెట్టేసింది. ఈ స్థితిలో చిరంజీవి ఒత్తిడి రాజకీయాన్ని అధిష్టానం సీరియస్‌గా తీసుకుంటోందని అంటున్నారు. దీనివల్ల చిరంజీవిపై అధిష్టానం పెద్దలకు గౌరవం తగ్గిందని అంటున్నారు. ఇద్దరు నాయకుల సలహా వల్లనే చిరంజీవి తన సహజశైలికి భిన్నంగా వ్యవహరించారనే పుకార్లు షికారు చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+