'రియల్' ఆపద్బాంధవుడు చిరంజీవి

Chiranjeevi
అవిశ్వాస తీర్మానానికి రెండు రోజుల ముందు చిరంజీవి అలకబూనినప్పటికీ ఆ తర్వాత ఆపద్భాంధవుడై కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆదుకున్నారు. జగన్ పార్టీ నుండి బయటకు వెళ్లి ప్రభుత్వానికి సవాళ్లు విసురుతున్న సమయంలో, తాను ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని నిలబెడతానని చిరంజీవి యువనేతకు ధీటుగా సమాధానం చెబుతూ వచ్చారు. అయితే అవిశ్వాసానికి రెండు రోజుల ముందు నుండి తన వర్గం ఎమ్మెల్యేలు కాంగ్రెసు పార్టీ తీరుపట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చిరంజీవి అలకపాన్పు ఎక్కారు. సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్సలు బుజ్జగించినప్పటికీ చిరు తగ్గలేదు. ఢిల్లీ పెద్దలే ఆయనకు నేరుగా ఫోన్ చేసి మేమున్నామని హామీ ఇచ్చారు.

వారు పలుమార్లు చిరుకు ఫోన్ చేసి ఆపద సమయంలో ఆదుకోండి, మిమ్మల్ని మేం నిర్లక్ష్యం చేయమని చెప్పారు. ఇన్నాళ్లూ నిలబెడతాననే వ్యాఖ్యలు పక్కన పెడితే చిరంజీవి అదును చూసి తన డిమాండ్లు నెరవేర్చుకున్నట్లుగా కనిపిస్తోంది. రాజకీయాల్లో ఇలాంటివి సహజమే అయినప్పటికీ చిరు వంటి వారు సమయం చూసి ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. ఏదైమైనా క్లిష్ట సమయాలమలో ఆయన ప్రభుత్వాన్ని ఆదుకొని సినీ జీవితంలోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఆపద్బాంధవుడు అనిపించుకున్నారు. దాంతో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటానని ప్రూవ్ చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+