చిరంజీవికి కాంగ్రెసు మెగా షాక్

గవర్నర్ కోటా కింద కోటగిరి విద్యాధర రావును ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చిరంజీవి కాంగ్రెసు అధిష్టానాన్ని కోరారు. మరోవైపు మరో ప్రజారాజ్యం అధినేత వేదవ్యాస్ కూడా ముమ్మరంగానే ప్రయత్నాలు సాగించారు. మాజీ కాంగ్రెసు నాయకుడైన వేదవ్యాస్ పూర్వ పరిచయాలతో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. కానీ ఇద్దరిని కూడా కాంగ్రెసు అధిష్టానం పట్టించుకోలేదు. చిరంజీవి వల్ల బ్రహ్మాండం బద్దలవుతుందని అనుకున్న కాంగ్రెసు అధిష్టానం కడప ఉప ఎన్నికల ఫలితాలతో అదే కాదని తేల్చేసుకుందని వినికిడి. ఏమైనా, చిరంజీవి పరుల మీద ఆధారపడాల్సిన స్థితిలోకి వచ్చారు.












Click it and Unblock the Notifications