వైయస్ వివేకా అల్లుడికి మొండిచేయి

వైయస్ జగన్‌పై నర్రెడ్డి రాజశేఖర రెడ్డి బలమైన అభ్యర్థి కాబోరని కాంగ్రెసు నాయకత్వం భావించినట్లు తెలుస్తోంది. నిజానికి మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డిని పోటీకి దించాలని అధిష్టానం భావించింది. కానీ ఆయన అందుకు సుముఖంగా లేరు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ అభ్యర్థిపై ఓడిపోయిన వరదరాజులు రెడ్డిని తెర మీదికి తెచ్చింది. అయితే, అనూహ్యంగా కందుల రాజమోహన్ రెడ్డి కూడా అభ్యర్థిగా ముందుకు రావచ్చునని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిపై అసంతృప్తితో ఉన్న కందుల రాజమోహన్ రెడ్డి తన సోదరుడు కందుల శివానంద రెడ్డితో పాటు కాంగ్రెసులో చేరే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications