గాలి జనార్దన్ రెడ్డి ఖల్ నాయకా?

గాలి జనార్దన్ రెడ్డి చేతిలో తిప్పలు పడినవారి వివరాలను ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మాజీ జనరల్ మేనేజర్ ఆంజనేయలు గాలి ఆగడాలను తట్టుకోలేక నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి కూడా పాల్పడినట్లు ఆ పత్రిక రాసింది. అచ్చం సినిమాల్లో లాగా గాలి జనార్దన్ రెడ్డి ఆంజనేయులు పంజా విసిరిన విషయాన్ని ఈనాడు దినపత్రిక వివరించింది. గాలి అక్రమాలపై పోరాడుతున్న తపాలా గణేష్‌పై గాలి జనార్దన్ రెడ్డి హత్యాయత్నం చేసినట్లు ఆరోపణలున్నాయి. పైగా, తపాలా గణేష్‌పైనే హత్యాయత్నం కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఏమైనా, గాలి జనార్దన్ రెడ్డి పాప ఫలితం అనుభవిస్తున్నారనే మాట ప్రత్యర్థుల నుంచి వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications