'సిల్క్ స్మిత'ను సొమ్ము చేసుకుంటున్న ఏక్తా!

బాలీవుడ్‌లోనూ ప్రత్యేక పాటల్లో నర్తించే వారు ఉన్నప్పటికీ ఏక్తా కపూర్‌కు ఉత్తరాదిన ఏమాత్రం పరిచయం లేని దక్షిణాది సిల్క్ స్మిత జీవిత గాథని చిత్రంలో తీయడంలోని ఆంతర్యం ఏమంటే ఈ చిత్రం కూడా రాగిని ఎమ్మెమ్మెస్ చిత్రంలా తక్కువ ఖర్చుతో తీయవచ్చు. అంతేకాదు దక్షిణాదిన సిల్క్ స్మితకు ఉన్న క్రేజ్ కారణంగా తెలుగు, తమిళ, కన్నాడ భాషలలో విడుదల చేయడం ద్వారా ఇక్కడే ఆ సినిమాకు అయిన ఖర్చు కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టుకోవచ్చు. ఇక సిల్క్ స్మితకు దక్షిణాదిన ఉన్న క్రేజ్‌ని సినిమా విడుదలకు ముందే ఉత్తరాదిన ప్రచారం చేసి ఆ తర్వాత చిత్రం విడుదల చేయడం ద్వారా భారీగా కాసులు రాలుతాయని భావిస్తోందంట. హిందీలో వ్యాంప్ పాత్రలు ధరించిన వారు చాలామంది ఉన్నప్పటికీ స్మిత జీవిత చరిత్రని చిత్రంగా తీసి కాసులు రాబట్టుకుందామనుకోవడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications