Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏ మంత్రికి 'గాలి' సొమ్ము?

Gali Janardhan Reddy
లారీలో తరలిస్తూ పట్టుబడిన దాదాపు నాలుగు కోట్ల రూపాయల సొమ్ము కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిదేనని తేలిపోయింది. అయితే, ఆ డబ్బును రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ మంత్రికి చేర్చాలని ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలతో ఆ మంత్రి ఎవరనేది ఆసక్తికరంగా మారింది. భారీగా బళ్లారి నుంచి హైదరాబాదుకు సొమ్మును తరలిస్తున్న లారీని అనంతపురం జిల్లా పోలీసులు గురువారం సాయంత్రం పట్టుకున్న విషయం తెలిసిందే.

లారీలో తరలిస్తున్న వేయి రూపాయల నోట్ల కట్టలను ఓ శాసనసభ్యుడికి పంపించి, అక్కడి నుంచి ఓ మంత్రికి చేర్చాలనేది ప్లాన్ అని చెబుతున్నారు. ఆ ఎమ్మెల్యే హైదరాబాదు లేదా రంగారెడ్డి జిల్లాకు చెందినట్లు పట్టుబడినవారు చెప్పారట. రంగారెడ్డి జిల్లాకు చెందిన మంత్రికి ఆ డబ్బును చేర్చాలని అనుకున్నారట. ఇంతకీ ఆ మంత్రి ఎవరనేది, గాలి జనార్దన్ రెడ్డితో ఆ మంత్రికి ఉన్న లింకేమిటి అనేది ఆసక్తికరంగా మారింది. ఆ మంత్రి గతంలో గనుల శాఖను నిర్వహించారట. బహుశా, ఆ మంత్రి ఎవరో అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+