తెలంగాణ, సమైక్య కార్యక్రమాలకు చెక్?

రాజధానిలో తెలంగాణ, సమైక్య రాష్ట్రాలకు మద్దతుగా చేసే భారీ కార్యక్రమాలు నిత్యం వివాదాస్పదం అవుతుండటంతో అనుమతులే నిరాకరించడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే విశాలాంధ్ర మహా సభ నిర్వహించే ఏ భారీ కార్యక్రమానికి కూడా భవిష్యత్తులో హైదరాబాదులో అనుమతులు లభించవనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ జెఏసి దీక్షలకు అనుమతులు నిరాకరించడంతో ఇకనుండి తెలంగాణవాదులు చేపట్టే దీక్షలు తదితర భారీ కార్యక్రమాలకు కూడా లభించక పోవచ్చుననే అభిప్రాయాలు వెలువడుతున్నాయి. అయితే ఎమ్మెల్యేల దీక్షలకు శాంతిభద్రతల దృష్ట్యానే అనుమతించలేదని సమాచారం.












Click it and Unblock the Notifications