ప్రముఖ సినీ నిర్మాత సి. కళ్యాణ్ ఆగడాలు ఒక్కటొక్కటే వెలుగు చూస్తున్నాయి. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌ను అడ్డం పెట్టుకుని కళ్యాణ్ చేసిన పనులకు అంతూ పొంతూ లేదని అంటున్నారు. హైదరాబాద్, హైదరాబాదు పరిసరాల్లో భూదందాలు అడ్డూ అదుపూ లేకుండా చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడిందని అంటున్నారు. సినీ రంగంలోనూ కళ్యాణ్ భాను కిరణ్ పేరు చెప్పి చక్రం తిప్పడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడినట్లు తెలుస్తోంది. పలు తెలుగు సినిమాల్లో నటించిన ఓ హీరోయిన్ కూడా కళ్యాణ్ నుంచి తప్పించుకోలేదని అంటున్నారు. కళ్యాణ్ బాధితుల్లో ఆమె చేరినట్లు చెబుతున్నారు. అయితే ఆమె ఎవరనేది బయటకు రావడం లేదు. నెల్లూరు వంటి ప్రాంతాల్లో కూడా కళ్యాణ్ భూ కబ్జాలకు పాల్పడినట్లు వార్తలు వచ్చాయి.