• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కనిమొళికి ఖుష్బూ బాసట

By Pratap
|

Khushboo
డేర్ డెవిల్ ఖుష్పూ పక్కా స్త్రీవాదినని అనిపించుకుంటోంది. సినీ తార ఖుష్పూ మరో సంచలనమైన ప్రకటన చేసింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఇరుక్కున్న డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి ఖుష్పూ మద్దతు పలుకుతోంది. ఓ మహిళగా తాను కనిమొళి వెంట ఉంటానని చెప్పింది. ఓ మహిళగా, తల్లిగా కనిమొళిని సమస్యలు చుట్టుముడుతున్నాయని ఆమె తెగ బాధపడిపోతోంది. తాను కూడా కనిమొళి లాగానే ఇబ్బంది పడుతున్నట్లు ఆమె తెలిపింది. కనిమొళి బలమైన వ్యక్తి అని కూడా చెబుతోంది.

కాగా, కనిమొళి బెయిల్ పిటిషన్ శనివారం విచారణకు రానుంది. 2జి స్పెక్ట్రమ్ స్కామ్‌లో కనిమొళి పీక లోతు మునిగిపోయారు. రాజాకు మాదిరిగానే కనిమొళికి కూడా జైలు కటకటాలు తప్పవేమోననే ప్రచారం జరుగుతోంది.

English summary
Actor and newbie politico Khushboo has stated, "As a woman I am with Kanimozhi." Khushboo told "Kanimozhi is undergoing lot of turmoil as a woman and as a mother...I have been through something very similar...Kanimozhi is a strong person."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X