హీరో బాలకృష్ణపై వెలిసిన ఓ వైబ్‌సైట్ తీవ్ర దుమారం రేపింది. బాలకృష్ణపై అసభ్య ప్రచారాన్ని ఆ వెబ్‌సైట్ ప్రారంభించింది. దీంతో సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై అసభ్య ప్రచారం చేస్తున్న ఓ వెబ్‌సైట్ మూలాలు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నట్లు వారు కనిపెట్టారు. ఐ హేట్ బాలయ్య డాట్ కామ్ వెబ్‌సైట్ తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందంటూ బాలకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తును చేపట్టారు. ఆ వెబ్‌సైట్‌ను సిడ్నీ నుంచి ఓ తెలుగు వ్యక్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. అలాగే 'బాబాయ్-అబ్బాయ్' పేరుతో సంక్షిప్త సందేశాలు పంపుతున్న వ్యక్తుల వివరాలనూ సేకరిస్తున్నారు. గూగుల్‌లోని 'గోడాడీ డాట్‌కాం' నుంచి 'ఐ హేట్ బాలయ్య' వెబ్‌సైట్ సమాచారం వస్తున్నట్లు గుర్తించామని డీసీపీ (నేరాలు) జె.సత్యనారాయణ తెలిపారు. సాంకేతిక అంశాలను మరోమారు పరిశీలించాక నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
A website called I hate Balayya started commenting on hero Balakrishna. Balakrishna complained against that website to police. Cyber crime police detected that website is running from Sydney.